VishnuKundinulu(విష్ణు కుండినులు) Dynasty Part- 2

Vishnu Kundinulu (విష్ణు కుండినులు) Dynasty – Part 2

విష్ణు కుండినులు రాజవంశం దక్షిణ భారత చరిత్రలో ఒక విశిష్టమైన స్థానం సంపాదించింది. ఈ వ్యాసంలో మూడవ మాధవవర్మ నుండి చివరి పాలకుల వరకు పాలన, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు మరియు బౌద్ధమత ప్రోత్సాహం గురించి తెలుసుకుందాం.

5. మూడో మాధవవర్మ

  • ఈపూరు తామ్ర శాసనం వేయించాడు.
  • త్రికూట మలయాధిపతి అనే బిరుదు కలిగి ఉన్నాడు.
  • రాజధాని – అమరపురం (అమరావతి).
  • ఇంద్రవర్మ, అగ్నిశర్మ బ్రాహ్మణులకు మ్రోతుకలి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చినట్లు శాసనం ఉంది.

6. ఇంద్రభట్టాకర వర్మ

  • అనేక అగ్రహారాలను బ్రాహ్మణులకు దానం చేశాడు.
  • అనేక ఘటికా స్థానాలను (హిందూ విద్యా కేంద్రాలు) స్థాపించాడు.
  • కీసర సమీపంలోని ఘటకేశ్వరము (ఘట్ కేసర్) ఘటికాస్థానం స్థాపకుడు.
  • సత్యాశ్రయుడు అనే బిరుదు కలిగి ఉన్నాడు.

7. విక్రమేంద్రభట్టారక వర్మ

  • ఇంద్రభట్టారక వర్మ పెద్ద కుమారుడు.
  • ఉత్తమాశ్రయుడు అనే బిరుదు.
  • రాజధానిని అమరావతి నుండి లెందులూరు (దెందులూరు)కు మార్చాడు.
  • బ్రాహ్మణులకు తుండి గ్రామం దానం చేశాడు.
  • పరమ మహాదేవి విహారానికి ఇరుందెర గ్రామం దానం.

8. నాలుగో మాధవవర్మ

  • జనాశ్రయ అనే బిరుదు కలిగి ఉన్నాడు.
  • ఈపూరు 2, పొలమూరు 2 శాసనాలు వేయించాడు.
  • విజయవాడ దుర్గామల్వీరస్వామి భక్తుడు.
  • చివరి పాలకుడు మంచన భట్టారకుని తరిమివేసి చాళుక్యులు రాజ్యం ఆక్రమించారు.
  • రాజలాంఛనము – సింహము (నాణేలపై లంఘించు సింహము ముద్ర).

పరిపాలన

  • రాజ్యాన్ని రాష్ట్రాలు, విషయాలుగా విభజించారు.
  • విషయాధిపతి, హస్తికోశుడు (గజబలాధ్యక్షుడు), వీరకోశుడు (పదాతి దళాధిపతి) వంటి సైనికాధికారులు.
  • ప్రాంతీయాధిపతులు దానాలు కూడా చేసేవారు.

ఇతర అధికారులు

  • రజ్జుక: భూములను కొలిచి పన్నులు నిర్ణయించేవారు.
  • ఫతదారుడు: పంట అంచనా వేసి శిస్తు నిర్ణయించేవాడు.
  • గుల్మికుడు: సరిహద్దు రక్షణాధికారి.
  • సెట్టి: ధాన్యాదాయ కొలత బాధ్యత.
  • అక్షపటలాధికారి: రాజాజ్ఞలను రాసేవాడు.

ఆర్థిక పరిస్థితులు

  • ఇక్ష్వాకుల తరువాత నాణేలు ముద్రించిన వారు.
  • రాగి మలామా చేసిన ఇనుము నాణేలు.
  • వాణిజ్యం క్షీణించడం వల్ల విదేశీ వాణిజ్యం తగ్గింది.
  • బర్మా, సయాం, కాంబోడియా, చైనా, జపాన్, సిలోన్ దేశాలతో వాణిజ్యం కొనసాగింది.
  • చక్రవర్తుల అలంపురం వద్ద రోమన్ బంగారు నాణేలు కనుగొన్నారు.

న్యాయ పరిస్థితులు

  • రాజు ముఖ్య న్యాయాధిపతి.
  • దివ్య పరీక్షల ద్వారా నేర విచారణ.

సామాజిక పరిస్థితులు

  • వైదిక మతానికి ప్రాధాన్యం.
  • కులవ్యవస్థ బలపడింది.
  • వైష్ణవ, శైవ భక్తి సమానంగా.
  • శ్రీ పర్వతస్వామి కులదైవం.
  • వివిధ దేవతా విగ్రహాలు నిర్మాణం (ఉదా: కొండమోటు నరసింహ).

బౌద్ధమతం

  • గోవింద వర్మ బౌద్ధమతాన్ని ప్రోత్సహించాడు.
  • విక్రమేంద్ర వర్మ పరమ మహాదేవి విహారానికి గ్రామం దానం చేశాడు.
  • కీసరగుట్టలో మహాయాన ఆనవాళ్లు.
  • తర్కపండితుడు దిగ్నాగుడు నివాసం.
  • వజ్రయాన శాఖ వ్యాప్తి, శక్తి పూజలు.
  • చివరి తెలుగు రాజులు బౌద్ధమతాన్ని ప్రోత్సహించిన వారు విష్ణు కుండినులు.

Post a Comment

Previous Post Next Post