VishnuKundinulu(విష్ణు కుండినులు) Dynasty Part- 3

Vishnukundinulu Dynasty (విష్ణుకుండినులు) – Part 3

వాస్తుశిల్పాలు

విష్ణుకుండినుల కాలం నాటి తెలంగాణ బౌద్ధ స్థావరాలు నల్లగొండ జిల్లాలోని తుమ్మలగూడెం, నాగారం, ఏలేశ్వరంలలోనూ, హైదరాబాదు సమీపంలోని చైతన్యపురిలోని గోవింద రాజ విహారంలోను కనిపిస్తాయి. ఈ కాలంలో మొట్టమొదటిసారిగా బండరాతిని తొలచి స్తూపాలుగా తీర్చిదిద్దిన ఆధారాలు ఖమ్మం జిల్లా కారుకొండ వద్ద లభించాయి.

విష్ణుకుండినుల కాలంలో వైదిక మత పునరుద్ధరణోద్యమానికి బౌద్ధం నిలదొక్కుకోలేక పోయింది. ఫలితంగా బౌద్ధ స్థావరాలు హిందూ దేవాలయాలుగా మారాయి. తెలంగాణలో అమరావతి (అమ్రాబాద్), ఇంద్రపాలనగరం, కీసరగుట్టలో వీరి కోటలు ఉన్నాయి.

  • కీసరగుట్ట – విశాలమైన భవనాలు, అంతఃపురాలు, శివాలయాలు, శక్తి ఆలయాలు ఇటుకలతో నిర్మాణం.
  • భువనగిరి కోట – విష్ణుకుండినుల రాజచిహ్నం మరియు లంఘిస్తున్న సింహం శిల్పాలు.
  • ఫణిగిరి తవ్వకాలలో – బౌద్ధ జాతక కథలు, బుద్ధుని పాదుకలు, చైత్యాలు, మంటపాలు.
  • తిరుమలగిరి, నేలకొండపల్లి – విరాట్ స్థూపం, బుద్ధుని పాలరాతి శిల్పాలు.
  • కరీంనగర్ – మంధని, గౌరీగుండం జలపాతం గుహలు, బౌద్ధ ఆరామాల గుర్తులు.

ఉమామహేశ్వరం, సలేశ్వరం, అలంపురం – శైవశక్తి ఆలయాలు. సలేశ్వరంలోని బ్రాహ్మీ శాసనం “విశ్వేశకక్కలస” అని ఉంది. అలంపురం బ్రహ్మేశ్వర, జోగులాంబ ఆలయాలు ప్రసిద్ధి గాంచాయి.

దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి హిందూ గుహాలయాలను నిర్మించిన వారు విష్ణుకుండినులు. ఉండవల్లి గుహాలయ స్తంభాలపై పంజా ఎత్తిపట్టిన సింహ ప్రతిమలు ఉన్నాయి. బొజ్జన్నకొండ, మొగల్రాజపురం, విజయవాడ, ఉండవల్లి, భైరవకొండ గుహాలయాలు ముఖ్యమైనవి.

విద్యలు & సాహిత్యం

విష్ణుకుండినుల రాజభాష సంస్కృతము. వీరు ఘటికలు (హిందూ విద్యాకేంద్రాలు) స్థాపించి వేదవిద్యలను ప్రోత్సహించారు. తెలంగాణలో ఘటికలను మొదటగా స్థాపించినవారు వీరే. ఘటికలలో చతుర్దశ విద్యలు బోధించబడేవి.

  • రెండో విక్రమేంద్ర వర్మ – సోమగిరీశ్వరునికి గ్రామ దానం.
  • శాసనాలలో – దక్షిణాధిపతి, త్రికూట మలయాధిప, శ్రీపర్వతస్వామి పాదానుధ్యాత.
  • తెలుగు పదాలు శాసనాలలో – “విజయ రాజ్య సంత్సరంబుళ్”, “తొలచువాండ్లు”.
  • జనాశ్రయ ఛందోవిచ్ఛిత్తి – తెలుగు కవిత్వంపై ప్రస్తావనలు.
  • విక్రమేంద్ర వర్మ – “మహాకవి”గా శాసనాలలో పేర్కొనబడ్డాడు.

భవశర్మ – వేదాంగాలు, ఉపనిషత్తులు అధ్యయనం చేసినట్లు తొండవాడ శాసనం చెబుతుంది. కొందరు రాజులు సాహిత్యాభిమానులు, కొందరు స్వయంగా విద్వాంసులు.


Source: Telangana & Andhra Pradesh Ancient History Notes

Post a Comment

Previous Post Next Post